Dinga Dinga Virus: ఉగాండాను వణికిస్తున్న డింగా డింగా వైరస్..! 1 d ago
ఆఫ్రికాలోని ఉగాండాలో బుండిబుగ్యా నగరంలో సుమారు 300 మంది డింగా డింగా అనే వైరస్ బారిన పడ్డారు. డ్యాన్స్ చేస్తున్న మాదిరి రోగి శరీరం తీవ్రస్థాయిలో వణకటంతో ఈ వ్యాధికి 'డింగా డింగా' అనే పేరు పెట్టారు. ఉగాండాలోని స్థానిక భాషలో 'డింగా డింగా' అంటే షేకింగ్ అని అర్ధం వస్తుంది.
డాన్సింగ్ ప్లేగ్..
1518లో ఫ్రాన్స్లోని స్ట్రాస్బర్గ్ ప్రాంతంలో విజృంభించిన డాన్సింగ్ ప్లేగ్ అనే వ్యాధి కారణంగా ఎంతో మంది మరణించారు. ఇప్పుడు ఉగాండాలో విజృంభిస్తున్న ఈ డింగా డింగా వైరస్ లక్షణాలు డాన్సింగ్ ప్లేగ్ యొక్క లక్షణాలను పోలినట్టే ఉందని భావిస్తున్నారు. అయితే, ఈ డింగా డింగా వైరస్ ఎక్కువగా మహిళలకు, బాలికలకు సోకుతుంది. మరోవైపు ఆఫ్రికాలోని డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో (DRC)లో అంతుచిక్కని మరో రకమైన వ్యాధి ప్రబలుతోంది. అది ఇప్పటికీ 400 మందికి సోకిందని, ఓకేచోట 394 కేసులు నమోదవ్వగా.. 30 మంది చనిపోయారని ప్రపంచ ఆరోగ్యం సంస్థ (WHO) చెప్పింది.
డింగా డింగా వైరస్ లక్షణాలు..
ఈ వైరస్ సోకినవాళ్లలో తీవ్రమైన జ్వరం, శరీరం తీవ్రంగా వణకటం, విపరీతమైన బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. కొంతమందిలో పరిస్థితి తీవ్రస్థాయికి చేరుకోగా.. పక్షవాతం బారిన పడుతున్నారు.